Four Allocations జిల్లాకు నాలుగు బార్లు కేటాయింపు
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:44 PM
Four Allocations for the District రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రీ నోటిఫకేషన్ ప్రకారం.. జిల్లాకు నాలుగు బార్లు కేటాయించినట్టు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి బి.శ్రీనాధుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పార్వతీపురం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రీ నోటిఫకేషన్ ప్రకారం.. జిల్లాకు నాలుగు బార్లు కేటాయించినట్టు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి బి.శ్రీనాధుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం మున్సిపాలిటీలో మూడు బార్లుకు గాను ఒక్కో దానికి రూ.55 లక్షలు, సాలూరు మున్సిపాలిటీలో ఒక బారుకు రూ.35 లక్షల చొప్పున రుసుం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 4న పార్వతీపురంలోని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కార్యాలయానికి దరఖాస్తులు అందజేయాలని చెప్పారు. 5న కలెక్టర్ కార్యాలయంలో లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు 94409 02362, 94409 02361, 94409 02360 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.