Share News

నేడు టీడీపీ జిల్లా కార్యాలయానికి శంకుస్థాపన

ABN , Publish Date - May 11 , 2026 | 12:27 AM

టీడీపీ విజయనగరం జిల్లా కార్యాలయ నిర్మాణ శంకుస్థాపన స్థలాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదివారం పరిశీలించారు.

నేడు టీడీపీ జిల్లా కార్యాలయానికి శంకుస్థాపన

విజయనగరం రూరల్‌, మే 10(ఆంధ్రజ్యోతి): టీడీపీ విజయనగరం జిల్లా కార్యాలయ నిర్మాణ శంకుస్థాపన స్థలాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదివారం పరిశీలించారు. నగరంలోని కణపాక నుంచి అయ్యన్న పేటకు వెళ్లే రహదారిలో ఈ కార్యాలయ నిర్మాణం జర గనుంది. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా నాయకులతో కలిసి మంత్రి ఆ స్థలాన్ని పరిశీలించారు. అలాగే కార్యక్రమంపై పార్టీ నాయకులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2026 | 12:27 AM