రూ.6.17 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:09 AM
పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు బుధవారం శ్రీకారం చుట్టారు.
బొబ్బిలి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు బుధవారం శ్రీకారం చుట్టారు. గొల్లపల్లిలో రూ.1.10 కోట్లతో అభివృద్ధి పనులు, దాడితల్లి గుడి నుంచి జంగాల శివాలయం వరకు రూ.2.0 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం, రైల్వేస్టేషన్ జంక్షన్‌లో రూ. 1.67 కోట్లతో రోడ్డు నిర్మాణానికి, మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో రూ.49 లక్షలతో రైతు బజారుకు వారు శంకుస్థాపన చేశారు. అనంతర స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడారు. పట్టణంలో రోడ్లకు సంబంధించి ఓ ముఖ్యమైన ఘట్టం చోటుచేసుకుందన్నారు. చాలా కాలం నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర వర్గాల ప్రజలు రోడ్లు పాడవడంతో నరకయాతనకు గురయ్యేవారన్నారు. రోడ్డడ పనులు పూర్తయితే ఆ సమస్యలకు తెరపడనుందన్నారు. పట్టణ ప్రజలకు అనుకూలమైన ప్రాంతంలో రైతు బజారుకు శంకుస్థాన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఆర్డీవో రామ్మోహనరావు, మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి గిరడ అప్పలస్వామి, ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకట నాయుడు, బీజేపీ ల్లా ప్రధానకార్యదర్శి వేమకోటి గిరిబాబు, టీడీపీ నాయకులు రాంబార్కి శరత్‌బాబు, గెంబలి శ్రీనివాసరావు, కాకల వెంకట రావు, పట్టణ తెలుగుమహిళా అధ్యక్షురాలు కళ్యంపూడి లక్ష్మి, మున్సిపల్ డీఈఈ పెదిరెడ్ల కిరణ్‌కుమార్, ఏఈలు గుప్త, కోటేశ్వరరావు, బీసపు చిన్నారావు, శివ తదితరులు పాల్గొన్నారు.
11111111111111111111
ప్రతీ ఇంటికి రక్షిత నీరు
ఫ పైలెట్ నీటి పథకాలు ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి
సాలూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఇంటికి రక్షిత తాగునీరు అందించేందుకు పైలెట్ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. బుధవారం పట్టణంలోని రూ.7.20 లక్షలతో ఏర్పాటు చేసిన నాలుగు పైలెట్ నీటి పథకాలను ఆమె ప్రారంభించారు. పట్టణంలోని 15వ వార్డు రెల్లివీధి, 21వ వార్డు గొల్లవీధి, 21వ వార్డు లావుడి వీధి, 22వ వార్డు తెలగా వీధిలో నీటి పథకాలు ఏర్పాటయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీ వార్డులో అవసరాన్ని బట్టి కొత్త తాగునీటి పథకాలు ఏర్పాటు చేస్తామన్నారు. సాలూరును మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడంలో ఇది మొదటి అడుగన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాగునీటి పథకాన్ని ప్రారంభిస్తున్న మంత్రి సంధ్యారాణి