Share News

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:59 PM

స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని 5, 6, 7, 8, 9 వార్డుల లో పలు అభివృద్ధి పనులకు మున్సిపల్‌ చైర్మన్‌ రాంబార్కి శరత్‌బాబు ఆదివారం శంకుస్థాపన చేశారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఐదో వార్డులో పనులకు శంకుస్థాపన మున్సిపల్‌ చైర్మన్‌ రాంబార్కి శరత్‌బాబు

బొబ్బిలి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని 5, 6, 7, 8, 9 వార్డుల లో పలు అభివృద్ధి పనులకు మున్సిపల్‌ చైర్మన్‌ రాంబార్కి శరత్‌బాబు ఆదివారం శంకుస్థాపన చేశారు. శ్మశానవాటికకు రూ. 8 లక్షలతో అప్రోచ్‌ రోడ్డు, రత్నాలనగర్‌లో రూ.6 లక్షలతో సీసీ రోడ్డు, 9వ వార్డు బాలాజీనగర్‌లో రూ.4 లక్షలతో సీసీ రోడ్డు, 16వ వార్డు నెయ్యిలవీధిలో రూ.8.50 లక్షలతో సీసీ రోడ్డు, 13వ వార్డు టీచర్స్‌ కాలనీలో రూ.3.54 లక్షలతో సీసీ రోడ్డు, 18వ వార్డు రావువారివీధిలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు, 30వ వార్డులో రూ. 5 లక్షలతో రిటైనింగ్‌ వాల్‌, 25వ వార్డు మారుతీనగర్‌లో రూ.5 లక్షలతో సీసీ డ్రైన్‌ పనులకు ఆయన భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి, డీఈఈ పెదిరెడ్ల కిరణ్‌కుమార్‌, ఏఈలు ఎ.ఎస్‌.కోటేశ్వరరావు, వీవీఎస్‌ఎన్‌ఈ గుప్త, ఆయా వార్డుల కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు బొత్స రమణమ్మ, బొట్టా తిరుపతి, సవలాపురపు రామకృష్ణ, బొత్స దమయంతి, కళ్యంపూడి లక్ష్మి, వెలగాడ హైమావతి, బొత్స అప్పులు, కళ్యంపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 11:59 PM