వంతెన పనులకు శంకుస్థాపన
ABN , Publish Date - Apr 27 , 2026 | 12:12 AM
శివరాంపురం సమీపంలో వేగావతి నదిపై వంతెన పనుల పునఃప్రారం భానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శ్రీకారం చుట్టారు.
సాలూరు, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): శివరాంపురం సమీపంలో వేగావతి నదిపై వంతెన పనుల పునఃప్రారం భానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శ్రీకారం చుట్టారు. ఇందుకుగానూ రూ.5.95 కోట్లను విడుదల చేయించారు. ఆదివారం శివరాంపురంలో వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శివరాంపురం గ్రామానికి వస్తే తన సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉంటుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వంతెన పనులకు నిధులు మంజూరు చేయించానన్నారు. మరో ఆరు నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి కానుందన్నారు. దీంతో 15 గ్రామాల ప్రజలకు లబ్ధి చేకురుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆముదాల పరమేశ్, నిమ్మాది తిరుపతిరావు, భాస్కరరావు, బాలాజీ, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.