Share News

గుడ్లకూర దుర్వాసన.. సరిగా ఉడకని అన్నం

ABN , Publish Date - Aug 07 , 2026 | 12:15 AM

సంతకవిటి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియార్‌ కళాశాలలో గురువారం అందించిన మధ్యాహ్న భోజనం తినడానికి చాలా మంది విద్యార్థులు నిరాకరిం చారు.

గుడ్లకూర దుర్వాసన.. సరిగా ఉడకని అన్నం

  • తినలేకపోయిన విద్యార్థులు

సంతకవిటి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): సంతకవిటి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియార్‌ కళాశాలలో గురువారం అందించిన మధ్యాహ్న భోజనం తినడానికి చాలా మంది విద్యార్థులు నిరాకరిం చారు. గుడ్ల కూర దుర్వాసన వస్తుండడం, అన్నం సరిగా ఉడకకపోవడంతో వారు తినలేకపోయారు. ఈ రెండు చోట్ల 427 మందికి మధ్యాహ్నభోజనం అందించే బా ధ్యత ఒక ఏజెన్సీకి అప్పగించారు. గురువా రం విద్యార్థులకు వడ్డించేముందు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపా ధ్యాయులు సాయి ఈశ్వరి వంటను పరిశీ లించారు. గుడ్ల కూర దుర్వాసన వస్తుం డడంతో విద్యార్థులకు వడ్డించలేదు. అన్నం, సాంబారు మాత్రమే వడ్డించినా.. అన్నం సరిగ్గా ఉడకకపోవడంతో కొందరు విద్యార్థు లు తినలేకపోయారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కూడా గుడ్ల కూర దుర్వాసన రావడంతో విద్యార్థులు భోజనం చేయడానికి నిరాకరించారు. దీంతో కళాశాల ప్రిన్సిపాల్‌ భవాని ఆదేశాల మేరకు వంట ఏజెన్సీ ప్రతినిధులు ప్రత్యామ్నాయంగా ఉప్మా, బిస్కెట్స్‌ అందించారు. ఈ ఘటనపై వంట ఏజెన్సీ నిర్వాహకులు స్పందిస్తూ ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని, గుడ్లు సరిగా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. జడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం సాయి ఈశ్వరి మాట్లాడుతూ గుడ్ల కూర దుర్వాసన గుర్తించి విద్యార్థులకు ఇవ్వలేదన్నారు.

Updated Date - Aug 07 , 2026 | 12:15 AM