Share News

Responsibility విద్యార్థుల్లో బాధ్యత పెంచాలి

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:44 PM

Foster Responsibility Among Students విద్యారులకు చదువు, క్రమశిక్షణతో పాటు బాధ్యతలను కూడా అలవాటు చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. పాఠశాలల నిర్వహణపై బుధవారం కలెక్టర్‌ నుంచి వర్చువల్‌ తనిఖీ నిర్వహించారు. ప్రార్థనా సమయంలో తప్పనిసరిగా విద్యార్థులతో యోగాసనాలు వేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

  Responsibility  విద్యార్థుల్లో బాధ్యత పెంచాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): విద్యారులకు చదువు, క్రమశిక్షణతో పాటు బాధ్యతలను కూడా అలవాటు చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. పాఠశాలల నిర్వహణపై బుధవారం కలెక్టర్‌ నుంచి వర్చువల్‌ తనిఖీ నిర్వహించారు. ప్రార్థనా సమయంలో తప్పనిసరిగా విద్యార్థులతో యోగాసనాలు వేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. మౌలిక సదుపా యాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. జిల్లాలో తాగునీటి సదుపాయం లేని అంగన్‌వాడీ కేంద్రాలకు వెంటనే పైపులైన్‌ కనెక్షన్లు ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలో 483 అద్దె భవనాలు సహా మొత్తం 712 అంగన్‌వాడీ కేంద్రాలకు తాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉందన్నారు. జలజీవన్‌ మిషన్‌ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ వైశాలి, డీఈవో బ్రహ్మాజీరావు, ఎంఈవోలు , ఐసీడీఎస్‌ పీడీ కనకదుర్గ, ఏటీడబ్ల్యూవోలు, డీఎల్‌డీవోలు, ఇతర ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 11:44 PM