Share News

Resurvey Drive రీసర్వేలో మన్యం ముందంజ

ABN , Publish Date - May 19 , 2026 | 11:21 PM

Forest Region Leads in Resurvey Drive ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రీసర్వేలో పార్వతీపురం మన్యం జిల్లా ముందంజలో ఉందని సీసీఎల్‌ఏ జి.జయలక్ష్మి తెలిపారు. భూ రికార్డులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఖాతాల సవరణ పురోగతిపై మంగళవారం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, జేసీలతో సమీక్షించారు.

 Resurvey Drive   రీసర్వేలో మన్యం ముందంజ
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, జేసీ తదితరులు

పార్వతీపురం, మే19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రీసర్వేలో పార్వతీపురం మన్యం జిల్లా ముందంజలో ఉందని సీసీఎల్‌ఏ జి.జయలక్ష్మి తెలిపారు. భూ రికార్డులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఖాతాల సవరణ పురోగతిపై మంగళవారం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, జేసీలతో సమీక్షించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఉన్న గ్రామాలు, ఖాతాల సంఖ్య, ముద్రణకు సిద్ధంగా ఉన్న రికార్డులు, పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించారు. భూ రికార్డుల ముద్రణ ప్రక్రియలో 94.71 శాతంతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా నిలిచిందని ఆమె తెలిపారు. పెండింగ్‌ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, సకాలంలో పాస్‌ పుస్తకాలు అందించాలని సూచించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో పార్వతీపురం, పాలకొండ ఐటీడీఏ పీవోలు ఆర్‌.వైశాలి. పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

బర్డ్‌ ఐ వ్యూ కలిగి ఉండాలి: కలెక్టర్‌

రోజువారీ విధుల్లో రెవెన్యూ అధికారులు కేవలం ఒక ఫైల్‌కో, ఒక గ్రామానికో పరిమితం కాకూడదని కలెక్టర్‌ తెలిపారు. మండలం, జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పనులపై బర్డ్‌ఐ ఫ్యూ కలిగి ఉండాలని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. డీఎల్‌ఆర్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా మ్యుటేషన్లు పెండింగ్‌లో ఉండరాదన్నారు. 56 గ్రామాల్లో త్వరితగతిన ఈకేవైసీ పూర్తి చేయాలనిఆదేశించారు. నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం మండలంలోని అన్ని గ్రామాల్లో ఏకకాలంలో ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ పనుల్లో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. భూ రికార్డులకు సంబంధించిన కాపీలను ముందుగా డోర్‌టు డోర్‌ పంపిణీ చేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో కె.హేమలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2026 | 11:22 PM