బలవంతపు భూసేకరణ ఆపాలి
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:52 PM
రోజువారీ వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న తాము ఇళ్లు గృహా లు కోల్పోతున్నామంటే ఎంతో బాధగా ఉందని మండ ల కేంద్రంలోని ప్రజలు కన్నీరు పెట్టారు.
డెంకాడ, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): రోజువారీ వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న తాము ఇళ్లు గృహా లు కోల్పోతున్నామంటే ఎంతో బాధగా ఉందని మండ ల కేంద్రంలోని ప్రజలు కన్నీరు పెట్టారు. డెంకాడలో రోడ్డు విస్తరణ, ఐటీ పార్కు అభివృద్ధి కోసం బలవంత పు భూసేకరణ ఆపాలని కోరుతూ మంగళవారం వారు మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడు తూ 20-40 యాక్షన్ ప్లాన్ ప్రకారం రోడ్డు విస్తరణలో అనేకమంది తమ ఇళ్లు కోల్పోతు న్నారని, అదే విధంగా ఐటీ పార్కు అభివృద్ధి కోసం వందలాది ఎకరాల భూమిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు ప్రదీప్‌రాజు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు పాణిరా జు, వైసీపీ నాయకుడు రొంగళి కనకసింహాచలం, టీడీపీ గ్రామ అధ్యక్షుడు సిరికి మహేశ్వరరావు, జనసేన పార్టీ నాయకుడు కె.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.