Share News

ప్రోత్సాహం లేక.. పరిశ్రమలు మూతపడి

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:14 AM

బొబ్బిలి, రాజాం తదితర ప్రాంతాల్లో గోగునార సాగు పరిశ్రమలు మూతపడడంతో క్రమంగా సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఒక ప్పుడు రైతులకు తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని అం దించిన గోగు పంటను ప్రస్తుతం చాలామంది రైతులు సాగు చేయడంలేదు

ప్రోత్సాహం లేక..  పరిశ్రమలు మూతపడి
చింతాడలో చెరువులో నానాబెట్టిన గోగు నార కట్టలు

బొబ్బిలి రూరల్‌, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి, రాజాం తదితర ప్రాంతాల్లో గోగునార సాగు పరిశ్రమలు మూతపడడంతో క్రమంగా సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఒక ప్పుడు రైతులకు తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని అం దించిన గోగు పంటను ప్రస్తుతం చాలామంది రైతులు సాగు చేయడంలేదు. అయితే ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్‌ ప్రారం భంలో ఆశించిన వర్షాలు కురకవకపోవడంతో వర్షాధార భూ ముల్లో ప్రత్యామ్నాయ పంటగా బొబ్బిలి మండలంలోని చింతా డ, పక్కి, కలవరాయి, కమ్మవలస, ముత్తావలస, శివడవలస తదితర గ్రామాల్లో ఇప్పటికీ ఈ ఏడాది సుమారు 200 ఎకరా ల్లో రైతులు గోగుసాగు చేపట్టారు. పంట దిగుబడి ఆశాజన కంగా ఉండడంతో రైతులు, కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మహిళా కూలీలకు ఉపాధి

పంట కోత అనంతరం చెరువులు, కాలువల వద్ద నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో గోగు కట్టలను నీటిలో నానబెడతారు. అనంతరం మహిళా కూలీలు నైపుణ్యంతో గోగు కట్టల నుంచి నారను వేరుచేస్తారు. ఒక్కో కట్టకు రూ.10 చొప్పున కూలి చెల్లి స్తుండగా ఒక్కో మహిళ రోజుకు సుమారు 30 కట్టలు వలిచి రూ.300 వరకు సంపాదిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు మంచి ఉపాధిని కల్పిస్తోంది.

తక్కువ పెట్టుబడితో సాగు

గోగు తక్కువ పెట్టబడితో సాగుచేసుకునే వర్షాధార పంట అని వ్యవసాయశాఖాధికారి మజ్జి శ్యామ్‌సుందర్‌ తెలిపారు. మెట్ట భూముల్లోనూ ఈ పంటను సాగు చేయవచ్చని, దీంతో రైతులకు అదనపు ఆదాయాన్ని వస్తుందన్నారు. రైతులు నాణ్య మైన విత్తనాలను వినియోగించి, వ్యవసాయశాఖ సూచనలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని సూచించారు.

Updated Date - Nov 08 , 2026 | 01:14 AM