Share News

Late... ఆలస్యంగా వచ్చారని..

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:31 PM

For Arriving Late... పట్టణంలోని 15వార్డులకు చెందిన సచివాలయ అధికారులతో పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ప్రజారోగ్యశాఖ అధికారి (డీపీహెచ్‌వో) వంశీకృష్ణ సమీక్షించారు. అయితే కొందరు సచివాలయ అధికారులు ఆలస్యంగా వచ్చారు. ఇంకొందరు హాజరు కాలేదు. దీంతో డీపీహెచ్‌వో వంశీకృష్ణ .. ఆలస్యంగా వచ్చిన అధికారులను సమావేశానికి అనుమతించలేదు

  Late...  ఆలస్యంగా వచ్చారని..
డీపీహెచ్‌వో వైఖరికి నిరసనగా బైఠాయించిన సచివాలయ అధికారులు

  • సమావేశ సమయం తప్పుగా చెప్పారంటూ.. కార్యాలయంలో బైఠాయించిన సిబ్బంది

పార్వతీపురం టౌన్‌, ఆగస్టు7(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని 15వార్డులకు చెందిన సచివాలయ అధికారులతో పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ప్రజారోగ్యశాఖ అధికారి (డీపీహెచ్‌వో) వంశీకృష్ణ సమీక్షించారు. అయితే కొందరు సచివాలయ అధికారులు ఆలస్యంగా వచ్చారు. ఇంకొందరు హాజరు కాలేదు. దీంతో డీపీహెచ్‌వో వంశీకృష్ణ .. ఆలస్యంగా వచ్చిన అధికారులను సమావేశానికి అనుమతించలేదు. సకాలంలో హాజరుకాని వారు వార్డుల్లోని ప్రజ లకు ఎలా సేవలు అందిస్తారని ప్రశ్నించారు. ప్రతిఒక్కరూ విధిగా సమయ పాలన పాటించాలని తెలిపారు. ఇంటి పన్నుల వసూళ్లతో పాటు పారిశుధ్య నిర్వహణ, తదితర సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. అయితే సమావేశ సమయానికి సంబంధించి తమకు తప్పుడు సమా చారాన్ని ఇచ్చారని కొంతమంది సచివాలయ అధికారులు మున్సిపల్‌ కార్యాలయంలో కాసేపు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వారితో డీపీహెచ్‌వో మాట్లాడి ఆలస్యానికి గల కారణాన్ని తెలుసుకున్నారు. ఇంకోసారి ఇలా చేయొద్దని సూచించారు. దీంతో వారు తిరిగి విధుల్లోకి వెళ్లారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరాజు, మేనేజర్‌ ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2026 | 11:31 PM