Follow road rules రహదారి నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:34 PM
Follow road rules ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి సూచించారు. జాతీయ రహదారి మాసోత్సవాల్లో భాగంగా గురువారం రవాణాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
రహదారి నిబంధనలు పాటించాలి
కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
విజయనగరం క్రైం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి సూచించారు. జాతీయ రహదారి మాసోత్సవాల్లో భాగంగా గురువారం రవాణాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, వాహనాలను అజాగ్రత్తగా నడపడం వల్లే 90 శాతం ప్రమాదాలు జరుగుతున్నా యన్నారు. నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చునన్నారు. వాహనం నడిపేటప్పుడు నిర్లక్ష్యాన్ని వీడి తమ కుటుంబాలను, పిల్లలను దృష్టిలో ఉంచుకుని భద్రతా నిబంధనలు పాటించాలన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ఈ నెల 1 నుంచి 31 వరకూ నిర్వహిస్తారని, రవాణాశాఖాధికారులు పలు అవగాహన సదస్సులు నిర్వహించి డ్రైవర్లకు, వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యా సంస్థల్లో కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖ ఉపకమిషనర్ మణికుమార్, రవాణాశాఖాధికారులు మురళీకృష్ణ, దుర్గాప్రసాద్, శశికుమార్, రవిశంకర్ ప్రసాద్, వెంకటరావు, శివరామగోపాల్, రమేష్‌కుమార్, ఉషా, శ్రావ్య, ఐశ్వర్యలక్ష్మీ, నవీన్‌లు పాల్గొన్నారు.