పంటల మార్పిడిపై దృష్టిసారించాలి
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:08 AM
పంటల మార్పిడి వైపు దృష్టిసారిం చాలని కురుపాం ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాసరావు సూచించారు.
రాజాం, జూలై 2 (ఆంధ్రజ్యోతి): పంటల మార్పిడి వైపు దృష్టిసారిం చాలని కురుపాం ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాసరావు సూచించారు. గురు వారం మండలంలోని విజయరాం పురంలో మండల ఉద్యాన శాఖ అధి కారి సీహెచ్ ఉమామహేశ్వరి అధ్యక్ష తన రైతులకు అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భం గా శ్రీనివాసరావు టిష్యూ కల్చర్, అరటి, మామిడి, జీడిమామిడి, కొబ్బరి, పామాయిల్, అంటుకట్టు కూరగాయల పంటల్లో తీసుకోవల్సిన జా గ్రత్తలు వివరించారు.
ఫగంట్యాడ, జూలై 2 (ఆంధ్ర జ్యోతి): ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు అనుకూలంగా ఉండకపోవచ్చని, దీంతో రైతులందరూ పంటమార్పిడి లేదా ఎద జల్లె పద్ధతిపై దృష్టిసారించాలని ఆత్మ ప్రాజెక్టు డైరక్టరు మహారాజన్ తెలిపారు. మండలంలోని మదుపాడ గ్రామంలోని గురువారం పంటలు మార్పిడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలోని ఎరువాక కేంద్రం కోఆర్టినేటర్ లక్ష్మణ్ , ఏవో శ్యామ్ కుమార్ పాల్గొన్నారు.