Share News

ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:06 AM

నిత్యం ఆదాయం వచ్చే ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి సూచించారు.

ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలి
కొయ్యపేటలో బంతి తోటను పరిశీలిస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

భోగాపురం, మార్చి6(ఆంధ్రజ్యోతి): నిత్యం ఆదాయం వచ్చే ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి సూచించారు. మండలంలోని కొయ్యపేటలో రైతులు సాగు చేస్తున్న పూలతోటలు, ఉద్యాన పంటలను శుక్రవారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి స్థానంలో పూల తోటలు, కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల తోటలను సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఉద్యాన పంటలు సాగుచేసే రైతులకు జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలు, ప్రోత్సాహం అందిస్తుందన్నారు. మార్కెట్‌ సదుపాయం కల్పిస్తామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని అన్నారు. అధిక దిగుబడులు సాధించేందుకు ఆధునిక విధానాలను అవలంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవనశాఖ డీడీ చిట్టిబాబు, వ్యవసాయ శాఖ ఏడీ నాగభూషణరావు, మండల వ్యవసాయ అధికారి హైమావతి, ఉద్యాన అధికారి ఉమాభరణి, కార్యదర్శి జయమ్మ, ఏఈవో వెంకటరావు, వీఏఏ శ్రావణి, వీహెచ్‌ఏ చందన, రైతులు బంగార్రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 12:12 AM