రుణాల రికవరీలపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:10 AM
: స్ర్తీనిధి రుణాలు రికవరీలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి కోరారు. మహిళా సంఘ సభ్యులు జోవనోపాధి మెరుగుపరచుకోవాలని తెలిపారు.
గజపతినగరం, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): స్ర్తీనిధి రుణాలు రికవరీలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి కోరారు. మహిళా సంఘ సభ్యులు జోవనోపాధి మెరుగుపరచుకోవాలని తెలిపారు. బుధవారం గజపతినగరంలో ఐదు మండలాల ఏపీఎంలు, వీఓఏలు, సీసీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ మహిళా సంఘ సభ్యులు జోవనోపాధి మెరుగుపరచుకొని ఆర్థిక పరి స్థితి నుంచి అభివృద్ధి చెందే విదంగా ప్రణాళికలను రూపొందించుకోవాలని కోరారు. మహిళలకు ఈ ఏడాదిలో ఎటువంటి రుణసదుపాయం కావాలో సంఘంలో చర్చించి తీర్మానం చేయాలని సూచించారు. కొన్ని మండలాలు రికవరీలో వెను కంజలో ఉన్నాయని, లక్ష్యాలను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ కె.సావిత్రి, డీపీఎంలు లక్ష్మునాయుడు, చిరంజీవి, రాజ్‌కుమార్ స్ర్తీనిధి ఏజీఎం చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.