Share News

ఓటర్ల జాబితా సవరణపై దృష్టి సారించండి

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:00 AM

ఓటర్ల జాబి తా సవరణపై నియో జకవర్గ స్థాయిలో ఉన్న నాయకులంతా దృష్టి సారించాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పిలుపు నిచ్చారు.

ఓటర్ల జాబితా సవరణపై దృష్టి సారించండి

  • విజయనగరం ఎమ్మెల్యే అదితి

విజయనగరం టౌన్‌, జూన్‌ 6(ఆంధ్ర జ్యోతి): ఓటర్ల జాబి తా సవరణపై నియో జకవర్గ స్థాయిలో ఉన్న నాయకులంతా దృష్టి సారించాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పిలుపు నిచ్చారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించి, మాట్లాడారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలు ఎంతో కీలకమని.. పార్టీ ప్రతినిధులు అంతా ముందస్తుగానే ప్రజల్లోకి వెళ్లి, కీలకమైన ఓట్లుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అలాగే బీఎల్‌ఏలతో ఎప్పటికప్పుడు కలిసి పనిచేస్తూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు పీవీజీ కుమార్‌, బూత్‌ కన్వీనర్లు, యూనిట్‌ ఇన్‌చార్జిలు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, పట్టణ, మండల నియోజకవర్గ, పార్లమెంట్‌, రాష్ట్ర స్థాయి కమిటీల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2026 | 12:00 AM