‘సర్’ ప్రక్రియపై దృష్టి సారించండి
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:57 PM
‘సర్’ ప్రక్రియ తుది దశకు చేరుకుందని, దీనిపై టీడీపీ శ్రేణులు దృష్టి కేంద్రీకరించాలని ఎమ్మెల్యే అదితి గజప తిరాజు అన్నారు.
ఎమ్మెల్యే అదితి
విజయనగరం రూరల్, జూలై 17(ఆంధ్రజ్యోతి): ‘సర్’ ప్రక్రియ తుది దశకు చేరుకుందని, దీనిపై టీడీపీ శ్రేణులు దృష్టి కేంద్రీకరించాలని ఎమ్మెల్యే అదితి గజప తిరాజు అన్నారు. నగరంలోని ఒకటో డివిజన్ టీడీపీ కమిటీతో శుక్రవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. కొత్త ఓటర్లను చేర్పించే దానిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇక వీఎంఆర్‌డీఏ ఆధ్వ ర్యంలో నగరంలో తొలి విడతగా రూ.10కోట్లతో రోడ్లు, కాలువలు వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆయా పనులు ఒకటో డివిజన్‌లో ఏ దశలో ఉన్నాయో.. ఆమె అడిగి తెలుసుకున్నారు. దశలవారీగా మరిన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేద్దామ న్నారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలరు మురగడాపు పార్వతీ, టీడీపీ ఒకటో డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు నక్కిళ్ల శ్రీనివాసరావు, బొద్దాన లక్ష్మణరావు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి.. ప్రజల నుంచి వినతులు స్వీకరిం చారు. సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరి స్తామని చెప్పారు.