పంచాయతీల అభివృద్ధిపై దృష్టి పెట్టండి
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:54 PM
పంచాయతీల అభివృద్ధిపై సిబ్బంది దృష్టి పెట్టాలని చీపురుపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి ఎస్.హేమసుందర్ కోరారు. సోమవారం చీపురుపల్లిలోని తన కార్యాలయంలో పంచాయతీ అధికారులతో సమా వేశం నిర్వహించారు.
చీపురుపల్లి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): పంచాయతీల అభివృద్ధిపై సిబ్బంది దృష్టి పెట్టాలని చీపురుపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి ఎస్.హేమసుందర్ కోరారు. సోమవారం చీపురుపల్లిలోని తన కార్యాలయంలో పంచాయతీ అధికారులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధిలైట్లు, తాగు నీరు, పారిశుధ్యం తదితర అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. రికార్డుల నిర్వహణలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచాంచారు. ప్రత్యేకాధికారులతో సమన్వయం చేసుకొని, ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డిప్యుటీ ఎంపీడీవో అప్పలనాయుడు పాల్గొన్నారు.