Share News

సురక్షిత తాగు నీరు సరఫరాపై దృష్టి: ఈఈ

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:29 AM

గ్రామాల్లో తాగునీటి రక్షిత పథకాల నిర్వహణపై అధికారులు అలసత్వం వహించరాదని పార్వతీపురం ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ ఎ.స్టాలిన్‌ సూచించారు. గురువారం మండలంలోని సుంకి, గరుగుబిల్లి, టీఆర్‌ఎన్‌వలసతో పాటు పలు గ్రామాల్లోని పథకాలు, బోరుబావులను పరిశీలించారు.

 సురక్షిత తాగు నీరు సరఫరాపై దృష్టి: ఈఈ
సుంకిలో బోరును పరిశీలిస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు

గరుగుబిల్లి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో తాగునీటి రక్షిత పథకాల నిర్వహణపై అధికారులు అలసత్వం వహించరాదని పార్వతీపురం ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ ఎ.స్టాలిన్‌ సూచించారు. గురువారం మండలంలోని సుంకి, గరుగుబిల్లి, టీఆర్‌ఎన్‌వలసతో పాటు పలు గ్రామాల్లోని పథకాలు, బోరుబావులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాధులు బారినపడకుండా ఉండేలా సురక్షిత తాగునీరును సరఫరా చేసే విధంగా దృష్టి సారించామన్నారు.ఆయన వెంట సాలూరు ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ మధుకు మార్‌రెడ్డి, డీఈఈ ప్రభాకరరావు, ఏఈ జి.గౌరీశంకర్‌ ఉన్నారు.

Updated Date - Sep 25 , 2026 | 12:29 AM