Share News

Profitable Crops లాభదాయక పంటలపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:45 PM

Focus on Profitable Crops for Better Returns ల్లాలో రైతులు లాభదాయక పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. వరికి బదులుగా అధిక ఆదాయం ఇచ్చే రాగి, జొన్నలు, మొక్కజొన్న, కంది, పత్తి తదితర పంటలను సాగు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

 Profitable Crops  లాభదాయక పంటలపై దృష్టి సారించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులు లాభదాయక పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. వరికి బదులుగా అధిక ఆదాయం ఇచ్చే రాగి, జొన్నలు, మొక్కజొన్న, కంది, పత్తి తదితర పంటలను సాగు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, అనుబంధశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ ఏడాది జిల్లాలో వరిసాగు విస్తీర్ణంలో 50 శాతం మేరకు తగ్గించాలన్నారు. వరి సాగు చేపట్టే రైతుల జాబితాను ఈ-పంట ద్వారా వ్యవసాయ సహాయకులు డౌన్‌డ్‌ చేసుకో వాలని ఆదేశించారు. ఆయా రైతులు వరికి బదులుగా ఏ పంటలు వేస్తున్నారో నమోదు చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ నిధులు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో అర్హత కలిగిన, గతంలో లబ్ధిపొందని వారి వివరాలు సేకరించి సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో శాతశాతం పంటల బీమా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. మన్యం రైతు పేరుతో సామాజిక మాధ్యమాలను ప్రారంభించి రైతులకు అవగాహన, సమాచారం అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఏవో టి.భవానీశంకరరావు, జిల్లా ఉద్యాన శాఖాధికారి జి.సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా మున్సిపాల్టీల్లో పబ్లిక్‌, కమ్యూనిటీ టాయిలెట్లను శుభ్రం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. వాటికి సంబంధించి రోజువారీ నివేదికలను వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మున్సిపల్‌ అధికారులతో ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది బల్క్‌ వేస్ట్‌ ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్‌ ప్రక్రియలో సాంకేతిక సమస్యలను అధిగమించాలన్నారు.

- జలధార, జలహారతి పనుల్లో 94 శాతం ప్రగతితో జిల్లా ముందంజలో ఉందని, మిగిలిన పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. జలధార, జలహారతి పనుల ద్వారా కలిగే లబ్ధిపై విజయగాథలను సిద్ధం చేయా లన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలో 9,374 పనులు గుర్తింగా, 8,687 పనులకు అనుమతులు మంజూరుచేశామన్నారు. 8,140 పనులు ప్రారంభ దశకు చేరుకోగా 4,872 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 3,268 పనులు విజయ వంతంగా పూర్తయ్యాయని తెలిపారు.

Updated Date - Jun 17 , 2026 | 11:46 PM