Share News

లాభసాటి పంటలపై దృష్టిసారించాలి

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:36 AM

లాభసాటి పంటలపైనే రైతులు దృష్టిసారించాలని అధికారులు రైతులకు సూచిం చారు. సోమవారం పలుచోట్ల రైతన్నా మీకోసం కార్య క్రమం నిర్వహించారు.

లాభసాటి పంటలపై దృష్టిసారించాలి
బొబ్బిలిరూరల్‌: చింతాడలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న రైతులు

లాభసాటి పంటలపైనే రైతులు దృష్టిసారించాలని అధికారులు రైతులకు సూచిం చారు. సోమవారం పలుచోట్ల రైతన్నా మీకోసం కార్య క్రమం నిర్వహించారు.

ఫరామభద్రపురం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది వర్షాధార పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేయడంతో అధిక నీటి వనరులు ఉండే పంటలను తగ్గించి ఆరుతడి పంటలు సాగుచేయాలని మండల వ్యవసాయాధికారి అమరాశివ తెలిపారు. మండలంలోని ముచ్చర్లవలసలో రైతన్నా మీకోసం కార్యక్రమం లో భాగంగా గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి మోహ న్‌కృష్ణ, సర్పంచ్‌ కనిమెరక శంకరరరావు, ఏఏవో బి.రాజశేఖర్‌ పాల్గొన్నారు.

ఫబొబ్బిలి రూరల్‌, మార్చి 16(ఆంధ్రజ్యోతి): సేంద్రీయ పద్ధతిలో సాగు చేసేందుకు రైతులు ముందుకురావాలని ఏడీఏ మధుసూదనరావు కోరారు. మండలంలోని మెట్ట వలస, చింతాడ రైతు సేవాకేంద్రాల్లో సోమవారం రైతన్నా...మీకోసం కార్యక్రమం ఏడీఏ మధుసూధనరావు ఆధ్వర్యంలో ఏవో మజ్జి శ్యామ్‌సుందర్‌ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ప్రభుత్వ పఽథకాలపై అవ గాహన కల్పించారు. ఇందులో భాగంగా రైతులకు నీటిభద్రత, డిమాండ్‌ ఆధారిత పంటలసాగు, అగ్రిటెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, సాగుకు ప్రభుత్వాల మద్దతు గురించి వివరిం చారు. అనంతరం రైతుల ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న పఽథకాలు గురించి వారికి వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.

Updated Date - Mar 17 , 2026 | 12:36 AM