Profitable Crops లాభసాటి పంటలపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:00 AM
Focus on Profitable Crops జిల్లాలో రైతులు లాభసాటి పంటలపై దృష్టి సారించాలని ప్రభుత్వ విప్ జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. శనివారం రాస్తాకుంటుబాయి గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు.
కురుపాం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులు లాభసాటి పంటలపై దృష్టి సారించాలని ప్రభుత్వ విప్ జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. శనివారం రాస్తాకుంటుబాయి గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో జరిగే మార్పులు, సాధించిన విజయాలను తెలుసుకునేందుకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు రైతులు సంఘాలుగా ఏర్పడి.. మరింత దిగుబడులు, ఆదాయం వచ్చే పంటలను సాగు చేయాలన్నారు. రైతు బజార్ల ఏర్పాటుతో పాటు వరి, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర కల్పించేందుకు సర్కారు చర్యలు తీసుకుం టుందన్నారు. జీడి మామిడి కొనుగోలు కోసం వ్యాల్యూయాడెడ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా గ్రామాల్లో రైతులకు ఎరువులు, క్రిమిసంహారక మందులు, సబ్సిడీపై అధునిక వ్యవసాయ యంత్రలు, పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో భూసారానిక తగ్గట్లుగా ప్రకృతి సాగు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అంతకు ముందు వారు స్టాల్స్ పరిశీలించారు. వ్యవసాయ శాఖ రూపొందించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ రాజ్యలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ కళావతి, డీఏవో అన్నపూర్ణ, కేవీకే శాస్త్రవేత్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గిరిజన రైతులు పాల్గొన్నారు.