ఆర్థిక వనరుల పెంపుపై దృష్టి
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:42 PM
పీఏసీఎస్‌లలో స్థలాలను వ్యాపార అవసరాలకు వాడుకొని ఆర్థిక వనరులు పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున తెలిపారు.
గజపతినగరం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పీఏసీఎస్‌లలో స్థలాలను వ్యాపార అవసరాలకు వాడుకొని ఆర్థిక వనరులు పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున తెలిపారు. గురువారం స్థానిక పీఏసీఎస్ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. కార్యాలయం ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో షాపులను నిర్మించి.. వాటి ద్వారా ఆదాయ వనరులు సమకూర్చుకోవాలన్నారు. అందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ సీవో ఉమామహేశ్వరరావు, జీఎం వాసు, డీజీఎం ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ లెంక బంగారునాయుడు, సీఈవో నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.