రద్దీగా ఉండే ఆలయాలపై దృష్టి పెట్టాలి
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:02 AM
శివరాత్రి పురస్కరించుకుని భక్తులు రద్దీగా ఉండే శివాలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టరు రామసుందర్ రెడ్డి ఆదేశించారు. శివరాత్రి ఏర్పా ట్లతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యత పనులు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పఽథకాలు అమలుపై కలెక్టరు బుధవారం క్షేత్ర స్థాయి అధికారులతో సమీక్షించారు.
విజయనగరం, కలెక్టరేట్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి) : శివరాత్రి పురస్కరించుకుని భక్తులు రద్దీగా ఉండే శివాలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టరు రామసుందర్ రెడ్డి ఆదేశించారు. శివరాత్రి ఏర్పా ట్లతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యత పనులు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పఽథకాలు అమలుపై కలెక్టరు బుధవారం క్షేత్ర స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ శివరాత్రి రోజున రామతీ ర్ధం, పుణ్యగిరి, ధర్మవరం సంగమేశ్వరాలయం, పాల్తేరు, కోటిపల్లి తది తర శివాలయాలకు భారీసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని తెలిపారు. పకడ్బందీగా క్యూలైన్లను ఏర్పాటుచేసి, దర్శనాలకు ఆటంకా లు జరగకుండా చూడాలన్నారు. ఉచిత బస్సు పఽథకం వల్ల మహిళలు గతం కంటే ఎక్కువగా వచ్చే అవకాశముందని చెప్పారు. తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రైవేటు ఆలయాలకు సంబందించి ఆలయ కమిటీలను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు.ఆలయాలు సమీపంలో జంక్షన్ల వద్ద కూడా పోలీసు బందో బస్తును ఏర్పాటు చేయాలన్నారు. ఆలయాలు వద్ద తగిన పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. రెవెన్యూ అంశాలకు సంబందించి ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలన్నారు. జేసీ సేదుమాధవన్ మాట్లాడుతూ ముటేషనన్లు వీలైనంత వేగంగా చేయాలన్నారు. తప్పులు లేకుండా పాస్ పుస్తకాలు పంపిణీ ఆదేశించారు.
ఏపీపీఎస్సీ పరీక్ష కేంద్రాల తనిఖీ
విజయనగరంలోని ఏపీపీఎస్సీఆధ్వర్యంలో జేఎన్‌టీయూ జరుగుతున్న పరీక్ష కేంద్రాలను బుధవారం కలెక్టరు రామసుందర్ రెడ్డి తనిఖీ చేశారు. ఫారెస్టు బీట్ ఆఫీసర్, ఎండోమెంట్ అధికారి ఉద్యోగాలు భర్తీకి పరీక్షలు జరుగుతున్న విషయం విదితమే.
కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన నిధులు వినియోగించాలి
వివిధ కేంద్ర పభుత్వ పఽథకాలు మంజూరు చేసిన రూ .40 కోట్లు నిధులు మార్చిలోగా వినియోగించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టరు రామసుందర్ రెడ్డి ఆదేశించారు. కేంద్ర పభుత్వం అమలు చేస్తున్న పఽథకాలపై సమీక్షించారు. నేషనల్ రూరల్ లైవ్లిహుడ్ మిషన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, రాషీయ కృషి యోజన, మిషన్ వాత్సల్య తదితర కేంద్ర ప్రభుత్వ పధకాలు అమలుకు జిల్లాకు మంజూరుచేసిన నిధుల్లో సుమారు 39.94 కోట్లు ఇంకా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిని మార్చి 15వ లోగా వినియోగించేందుకు తక్షణమే చర్యలు ప్రారంభించాలని చెప్పారు.