మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టండి
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:50 PM
ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టాలని, సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధి కారులు సమన్వయంతో పనిచేయాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు ఆదేశించారు.
చీపురుపల్లి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టాలని, సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధి కారులు సమన్వయంతో పనిచేయాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు ఆదేశించారు. బుధవారం రాజాంలోని క్యాంపుకార్యాలయంలోతాగు నీరు, రహదారులు, పంచాయతీరాజ్ తదితరశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మండ లాల వారీగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగజేసే అంశాలపై ముందుగా దృష్టి పెట్టాలన్నారు. ప్రాధాన్యత క్రమం లో వాటిని పరిష్కరించాలన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈలు శ్రీలత, గోవిందరావు పీఆర్ డీఈ శ్రీనివాసరావు, నాలుగు మండలాల ఎంపీడీఓలు, మండల ఇంజనీర్లు, పీఆర్ జేఈలు పాల్గొన్నారు.