ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించండి
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:08 AM
ల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిపెట్టాలని జిల్లా వ్యవసాయాధికారి వీటీ రామారావు పేర్కొన్నారు.
బొండపల్లి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిపెట్టాలని జిల్లా వ్యవసాయాధికారి వీటీ రామారావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గొల్లుపాలెంలోగల రైతు సేవా కేంద్రంలో రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ తక్కువ నీటితో సాగయ్యే రాగులతోపాటు, అపరాల సాగుపై రైతులు దృష్టిసారించడం ద్వారా కొంత వరకు నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో గజపతినగరం ఏడీఏ శ్రీనివాసరావు, ఏవో ఆర్.రేఖా, వ్యవసాయశాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.