విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:10 AM
గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశించారు.
సీతంపేట రూరల్, జూన్ 18 (ఆంధ్ర జ్యోతి): గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో గురువారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ, గురుకుల పాఠశాలల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాల్స్, హెచ్‌డబ్ల్యూవోలతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన విద్యాలయాల్లో చదువుతు న్న ప్రతి గిరిజన విద్యార్థినికి సమగ్ర వైద్యపరీక్షలు నిర్వహించాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో గిరిజన విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్రమాణా లు, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. సమావేశంలో డీడీ ఎం.అన్నాదొర, డిప్యూటీ ఈవో పి.నారాయడు, జీసీడీవో రాములమ్మ, సీఎంవో చిరంజీవులు, ఏటీడబ్ల్యూవో రాంబాబు, సూపరింటెండెంట్ అప్పారావు పాల్గొన్నారు.