Share News

విద్యార్థులపై దృష్టి సారించాలి: డిప్యూటీ డీఈవో

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:13 AM

చదువులో వెనుకబడిన విద్యా ర్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ డీఈవో కర్రి కృష్ణమూర్తి ఆదేశించారు. శనివారం మండలంలోని పెదమేరంగి, బీజేపురం గ్రామాల్లో జడ్పీ హైస్కూళ్లను ఆకస్మిక తనిఖీ చేశారు.

విద్యార్థులపై దృష్టి సారించాలి: డిప్యూటీ డీఈవో
పెదమేరంగిలో ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న కృష్ణమూర్తి

జియ్యమ్మవలస, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): చదువులో వెనుకబడిన విద్యా ర్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ డీఈవో కర్రి కృష్ణమూర్తి ఆదేశించారు. శనివారం మండలంలోని పెదమేరంగి, బీజేపురం గ్రామాల్లో జడ్పీ హైస్కూళ్లను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి పలు పాఠ్యాంశాలపై విద్యా ప్రమాణాలపై ఆరా తీశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ముస్తాబు కార ్యక్ర మం పకడ్బందీగా అమలు చేయడంతోపాటు టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. పాఠశాలల్లో విద్యార్థుల రోల్‌ పెంచేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది పదో తరగతి శతశాతం ఉత్తీర్ణత సాధిం చడంతోపాటు ఐఐఐటీలో అత్యధిక సీట్లు సాధించేలా తర్ఫీదు ఇవ్వాలని, దీనికి ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఆయన వెంట మండల విద్యాశాఖాధికారి-1 ఎన్‌.విజయలక్ష్మి ఉన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 12:13 AM