స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:01 AM
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు సూచించారు.
గరుగుబిల్లి, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు సూచించారు. గురువారం గరుగుబిల్లి పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికలకు అవరోధం కల్పించే వారి వివరాలను ముందస్తుగా సేకరిం చాలన్నారు. ఇంటింటికి మన్యం పోలీస్ కార్యక్రమం, మన్యంతో మమేకం కార్యక్రమం గ్రామాల్లో విధిగా నిర్వహించి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చొరవ చూపా లని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించి మన్ననలను పొందాలన్నారు. ప్రజల నుంచి అందే వినతులను పరిశీలించి న్యాయం చేయాలన్నారు. గ్రామాల్లో అనధికార మద్యం దుకాణాలు, సారా అమ్మకం, తయారీ వంటి నిరోధానికి చొరవ చూపాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ఉండేలా గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సిబ్బంది నుంచి సమస్య లు తెలుసుకోవడం,రికార్డులను పరిశీలించి అవసరమైన సూచనలను అందించారు. ఆయన వెంట చినమేరంగి సీఐ టీవీ తిరుపతిరావు, ఎస్‌ఐ ఫకృద్ధీన్ ఉన్నారు.