నాగావళికి వరద
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:34 PM
తుఫాన్‌తో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఒడిశా నుంచి వస్తున్న వరద కారణంగా తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో గురువారం ప్రవాహ ఉధృతి పెరిగింది.
- స్పిల్‌వే గేట్ల నుంచి నీరు విడుదల
గరుగుబిల్లి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌తో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఒడిశా నుంచి వస్తున్న వరద కారణంగా తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో గురువారం ప్రవాహ ఉధృతి పెరిగింది. ప్రాజెక్టులోకి 17,200 క్యూసెక్కులు చేరగా, స్పిల్‌వే గేట్ల నుంచి 9 వేల క్యూసెక్కులను అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్టు పరిధిలో 105 మీటర్లకు గాను 103.98 మీటర్లు, 2.534 టీఎంసీలకు గాను 1.890 టీఎంసీల మేర నీటి నిల్వ సామర్థ్యం నెలకొంది. కుడి ప్రధాన కాలువ నుంచి సాగునీటిని నిలుపుదల చేశారు. పాత రెగ్యులేటర్ పరిధిలోని ఎడమ, కుడి ఉప కాలువల నుంచి 180 క్యూసెక్కులను సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టులో 100 శాతానికి గాను 74.59 శాతం మేర నిల్వలు ఉన్నాయి. వరద ఉధృతి మరింతగా పెరిగితే స్పిల్‌వే గేట్ల నుంచి నదిలోకి మళ్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ప్రాజెక్టు ఈఈ హెచ్.మన్మథరావు, ఏఈలు శ్రీనివాసరావు, కిషోర్‌కుమార్ తెలిపారు.