Share News

ఎగసిపడిన అగ్ని కీలలు

ABN , Publish Date - May 01 , 2026 | 12:40 AM

వారంతా చిరువ్యాపారులు. రాత్రి 10 గంటల వరకూ వ్యాపారం చేసుకుని ఇంటికి చేరుకున్నా రు.

 ఎగసిపడిన అగ్ని కీలలు

  • నాలుగు షాపులు దగ ్ధం

  • రూ.6 లక్షల ఆస్తి నష్టం

విజయనగరం క్రైం, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): వారంతా చిరువ్యాపారులు. రాత్రి 10 గంటల వరకూ వ్యాపారం చేసుకుని ఇంటికి చేరుకున్నా రు. భోజనం చేసి నిద్రలోకి జారుకుంటున్నారు. ఇంతలో తెలిసిన వారు షాపులు కాలిపోతున్నా యని ఫోన్‌.. ఆతృతగా అక్కడకు చేరుకున్నారు. తాళాలు పగులగొట్టి షాపుల్లోకి ప్రవేశించారు. వస్తువులు కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు. అప్పటికే అగ్ని కీలలు పూర్తిగా వ్యాపించాయి. కళ్ల ముందే సర్వం బూడి దయ్యింది. ఆర్‌అండ్‌బీ బంగ్లా పక్కన రైతు బజారు కూడలి వద్ద బుధవారం రా త్రి సుమారు 12 గంటల సమయంలో అగ్ని ప్రమాదం వాటిల్లింది. శివకుమార్‌, పైడపనాయుడు, మధుకు చెందిన డ్రైఫ్రూట్స్‌ షాపులు, గాయిత్రీ స్వీట్‌ స్టాల్‌కు అగ్ని ప్రమాదం సంభవించింది. మూడు ఫ్రూట్స్‌ షాపుల్లో మిక్సీలు, ఫ్యాన్లు, ఫర్నీ చర్‌ పూర్తిగా కాలిపోగా.. స్వీట్‌ స్టాల్‌లో రిఫ్రిజిరేటర్‌ కాలిపోయింది. షార్ట్‌ సర్య్కూ ట్‌ వల్ల ప్రమాదం వాటిల్లినట్టు తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంట లను అదుపు చేశారు. రూ.6లక్షల నష్టం వాటిల్లినట్టు వారు తెలిపారు.

Updated Date - May 01 , 2026 | 12:40 AM