ఐదుగురు గంజాయి నిందితులకు రిమాండ్
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:30 AM
గంజాయి వినియోగిస్తున్న కేసు లో పట్టుబడిన ఐదుగురు వ్యక్తులకు ఎస్.కోట న్యాయాధికారి రిమాండ్ విధించి నట్టు సీఐ నారాయణమూర్తి తెలిపారు.
శృంగవరపుకోట, జనవరి 25(ఆంధ్రజ్యోతి): గంజాయి వినియోగిస్తున్న కేసు లో పట్టుబడిన ఐదుగురు వ్యక్తులకు ఎస్.కోట న్యాయాధికారి రిమాండ్ విధించి నట్టు సీఐ నారాయణమూర్తి తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్ లో వివరాలు వెల్లడించారు. శనివారం సాయంత్రం బొడ్డవర రైల్వేస్టేషన్ సమీ పంలో కొందరు గంజాయి తాగుతున్నారన్న సమాచారంతో అక్కడికి చేరుకున్నా మన్నారు. అక్కడ గంజాయి తాగుతున్నవారిని గుర్తించి, అరెస్టు చేశామని తెలి పారు. వీరిలో ఎస్.కోటకు చెందిన గణేష్, మహ్మద్, వినోద్‌కుమార్, ధర్మవరం గ్రామానికి చెందిన రాజ్‌కుమార్, అనకాపల్లికి చెందిన వ్యక్తి ఉన్నారని చెప్పారు. వీరి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.