దాడి కేసులో ఐదుగురి అరెస్టు
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:09 AM
మండలంలోని ఒడిశా దాబా యజమా నితో పాటు కుక్ , యజమాని సోదరుడిపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడి న కేసులో ఐదుగురు యువకులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ యు.మహేష్ తెలిపారు.
బొండపల్లి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఒడిశా దాబా యజమా నితో పాటు కుక్ , యజమాని సోదరుడిపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడి న కేసులో ఐదుగురు యువకులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ యు.మహేష్ తెలిపారు. సోమవారం ఆయన ఈ కేసుకు సంబంధించి వివరాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 16వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామానికి చెందిన యువకులు తాగి న మత్తులో బొండపల్లిలోని దాబా యజమానిపైన, అతని సోదరుడిపై, కుక్‌పైన దాడి చేసి, క్యాష్ కౌంటర్‌లోని డబ్బును దౌర్జన్యంగా తీసుకువెళ్లారు. దాబా యజ మాని ఎస్.ప్రదాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మజ్జి ప్రసాద్ తోపాటు తమ్మినేని లోకేష్, సుంకరి మోహనరావు, శనపతి ఉదయ్‌కిరణ్, గెద్ద సంతోష్‌ల ను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విఽ దించింది. వారి నుంచి రూ.3వేలు, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.