Share News

Firecracker sales at Rs 55 crore? బాణసంచా అమ్మకాలు రూ.55 కోట్లు?

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:49 PM

Firecracker sales at Rs 55 crore? దీపావళి పండుగ సందడిగా సాగింది. పిల్లలు, పెద్దలు, యువత భాగస్వామ్యంతో హోరెత్తింది. ఈ నేపథ్యంలో బాణసంచా అమ్మకాలు వ్యాపారులకు భారీ లాభాన్నే తెచ్చి పెట్టాయి. జిల్లాలో సుమారు రూ.55 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు మార్కెట్‌ వర్గాల అంచనా.

Firecracker sales at Rs 55 crore? బాణసంచా అమ్మకాలు   రూ.55 కోట్లు?

బాణసంచా అమ్మకాలు

రూ.55 కోట్లు?

రూ.16 కోట్లు మాత్రమే టర్నోవర్‌ చూపించిన వ్యాపారులు

నగదు, యూపీఐ లావాదేవీలపై నిఘా ఏదీ?

విజయనగరం రింగురోడ్డు, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): దీపావళి పండుగ సందడిగా సాగింది. పిల్లలు, పెద్దలు, యువత భాగస్వామ్యంతో హోరెత్తింది. ఈ నేపథ్యంలో బాణసంచా అమ్మకాలు వ్యాపారులకు భారీ లాభాన్నే తెచ్చి పెట్టాయి. జిల్లాలో సుమారు రూ.55 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు మార్కెట్‌ వర్గాల అంచనా. అధికారికంగా నమదైన టర్నోవర్‌ మాత్రం రూ.16 కోట్లకే పరిమితమైనట్టు సమాచారం. ఈ రెండు గణాంకాల మధ్య భారీ వ్యత్యాసానికి కారణం ఏమిటీ? వాస్తవ విక్రయాలు పూర్తిగా లెక్కల్లోకి వచ్చాయా? పన్నుల ఎగవేతకు అస్కారం వుందా?అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాణిజ్య పన్నుల శాఖ సమగ్ర పరిశీలన చేపడితేనే అసలు లెక్కలు వెలుగులోకి వచ్చే అవకాశం వుంది.

- బాణా సంచా విక్రయాల్లో నగదు లావాదేవీలతో పాటు ఫోన్‌పే, గూగూల్‌పే, ఇతర యూపీఐ చెల్లింపులు పెద్ద ఎత్తున జరిగాయి. వ్యాపారాలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, డిజిటల్‌ చెల్లింపులు, రోజువారీ రికార్డుల విక్రయాలను సరిపోల్చాల్సిన అవసరం వుంది. వ్యక్తిగత ఖాతాల్లోకి వచ్చిన మొత్తాలన్నీ, వ్యాపార ఆదాయమేనని భావించకుండా వాటి స్వభావాన్ని పరిశీలించి, సంబంధిత లావాదేవీలను గుర్తించాల్సిన అవసరం వుంది. కస్టమర్‌కు జారీ చేసిన బిల్లులు, వ్యాపారుల రికార్డుల్లో నమోదైన అమ్మకాలు ఒకేలా వున్నాయా? అన్నది సమగ్రంగా తనిఖీ చేస్తేనే తెలుస్తుంది.

- జిల్లాలో 9 మంది రెగ్యులర్‌ బాణసంచా వ్యాపారులతో పాటు 50 మంది తాత్కాలిక పన్ను చెల్లింపుదారులు వున్నట్టు సమాచారం. వీరంతా కలిపి సుమారు రూ.16 కోట్ల టర్నోవర్‌ మాత్రమే చూపించనున్నట్టు తెలుస్తోంది.

- తమిళనాడులోని శివకాశీ తదితర ప్రాంతాల నుంచి బాణసంచా సరఫరా అయ్యింది. ఇతర జిల్లాల నుంచి కూడా బాణసంచా జిల్లాకు సరఫరా అయ్యింది. రవాణాకు సంబంధించిన ఇన్వాయిస్‌లు, నిబంధనల ప్రకారం అవసరమైన ఈ-వే బిల్లులు, సరుకు పరిమాణం, విలువలను అధికారులు పరిశీలించాల్సిన అవసరం వుంది. సరఫరాదారులు చూపిన అమ్మకాలు, స్థానిక వ్యాపారులు చూపిన కొనుగోళ్లుతో సరిపోతున్నాయా? అన్నది జీఎస్టీ రికార్డుల ద్వారా నిర్ధారణ చేయాలి. రవాణా పత్రాల్లో చూపిన విలువకు వాస్తవ లావాదేవీలకు వ్యత్యాసాలు వున్నాయా? అన్నది అధికారులు గుర్తించాలి.

ఐటీసీ క్లైయిమ్‌లపైన దృష్టి

కొనుగోళ్లుపై ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) తీసుకున్న వ్యాపారాలు అర్హత నిబంధనలు పాటించారా? సరఫరాదారులు రిటర్నులు, కొనుగోలుదారుల జీఎస్‌టీఆర్‌-1, జీఎస్‌టీఆర్‌-3బీ, జీఎస్‌టీఆర్‌-2బి వివరాల్లో వ్యత్యాసాలు వున్నాయన్నది పరిశీలించాలి. గత మూడేళ్లు దీపావళి సీజన్‌ టర్నోవర్‌తో ఈ ఏడాది లావాదేవీలు పోల్చితే, అసాధారణ మార్పులను అధికారులు గుర్తించొచ్చు.

- ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా దీపావళి వ్యాపార లావాదేవీలపై సమగ్ర పరిశీలన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇదే విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ రాష్ట్ర పన్నుల సంయుక్త కమిషనర్‌ కొంపెల్ల అపర్ణను వివరణ కోరగా పన్ను చెల్లింపుదారుల వ్యాపార లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పన్ను ఎగవేతలకు పాల్పడినట్టు రుజువైతే, జీఎస్‌టీ చట్టం ప్రకారం కఠినమైన జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె స్పష్టంచేశారు.

Updated Date - Nov 09 , 2026 | 11:49 PM