జామిలో అగ్నిప్రమాదం
ABN , Publish Date - May 20 , 2026 | 12:12 AM
మండల కేంద్రం జామిలో సోమవా రం రాత్రి స్థానిక ఎస్సీ కాలనీకి చెం దిన సూరప్పడు ఇంట్లో అగ్నిప్ర మాదం చోటుచేసు కుంది.
జామి, మే 19 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం జామిలో సోమవా రం రాత్రి స్థానిక ఎస్సీ కాలనీకి చెం దిన సూరప్పడు ఇంట్లో అగ్నిప్ర మాదం చోటుచేసు కుంది. ఈ ప్రమా దంలో పూరిల్లు దగ్ధం కావడంతో పాటు స్థానికులు పార్కింగ్ చేసిన నాలుగు ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. ఇంట్లో వంట చేశాక కట్టెల పొయ్యిని సరిగ్గా ఆర్పకపోవడంతో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ వా హనాలతో పాటు ఇంట్లో ఉన్న వస్తువులు, నగదు కూడా కాలిపోయింది. బాధిత కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. ఈ ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న సిలిండర్ పేలిందని.. అయితే చూట్టుపక్కల వారికి ఎటువంటి నష్టం జరగ లేదని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబానికి రూ.5లక్షల నష్టం వాటిల్లిందని చెప్పారు. టీడీపీ మండల అధ్యక్షుడు వర్రి రమణ, గ్రామ కమిటీ అధ్యక్షుడు అప్పలనాయుడు, మాజీ సర్పంచ్ ఇప్పాక వెంకటత్రివేణి అక్కడకు చేరుకున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే లలితకుమారీకి ఫోన్ ద్వారా తెలియజే శారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలు అదుపు చేయడం వల్ల పెను ప్రమాదం తప్పింది.