Share News

స్ర్కాప్‌ దుకాణంలో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:28 AM

మండల పరిధిలోని వీఆర్‌ అగ్రహారం గ్రామ పరిసరాల్లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో స్ర్కాప్‌ దుకాణం ఆహుతయ్యింది.

  స్ర్కాప్‌ దుకాణంలో అగ్నిప్రమాదం

రాజాం రూరల్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని వీఆర్‌ అగ్రహారం గ్రామ పరిసరాల్లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో స్ర్కాప్‌ దుకాణం ఆహుతయ్యింది. సుమారు రూ.3లక్షల ఆస్తి నష్టం ఉంటుందని అంచనా. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. సమాచారం తెలిసిన వెంటనే రాజాం అగ్నిమాపక శాఖాధికారి అశోక్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే పాలిథిన్‌ కవర్లు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు కావడంతో షెడ్‌తో పాటు నిల్వ చేసిన మెటీరియల్‌ పూర్తిగా దగ్ధమైంది. షార్ట్‌ సర్క్యూట్‌కు అవకాశం లేదని, తమపై కక్షతో గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా నిప్పంటించారని పొగిరి గ్రామానికి చెందిన షెడ్‌ యజమాని సిరిపురపు నాగరాజు ఆరోపిస్తున్నారు.

Updated Date - Jan 26 , 2026 | 12:28 AM