ఎస్టీ కాలనీలో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:24 AM
మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీలోని చిన్నారి శ్రీను ఇంట్లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది.
భామిని, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీలోని చిన్నారి శ్రీను ఇంట్లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లోని సామగ్రి కాలిబూడిదైంది. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న శ్రీను కుటుంబం రాత్రి భోజనం అనంతరం పైఅంతస్తులో నిద్రించేందుకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. దాంతో ఇంట్లోని సామగ్రి యావత్తూ కాలిపోయింది. సమాచారం అందుకున్న కొత్తూరు అగ్నిమాపక కేంద్రం ఇన్చార్జి జి.రమణమూర్తి ఘటనా స్థలానికి చేరుకునే సరికి స్థానికులు మంటలను అదుపుచేశారు. శనివారం ఘటనా స్థలాన్ని ఆర్ఐ మణిభూషణ్ పండా, వీఆర్వో మహేశ్ సందర్శించి సుమారు రూ.2 లక్షలు ఆస్తినష్టం జరిగినట్టు అంచనా వేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో శ్రీను కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.