Share News

గోవిందపురంలో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Feb 08 , 2026 | 12:01 AM

గోవిందపురం గ్రామంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది.

 గోవిందపురంలో అగ్ని ప్రమాదం

  • తెగిపడిన విద్యుత్‌ తీగలు.. ధాన్యం, గడ్డి వాముల దగ్ధం

సంతకవిటి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని గోవిందపురం గ్రామంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్‌ తీగలు తెగి పడ డంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాగోలు కాంతమ్మ, రాగో లు గణకు చెందిన మినప చేను, ధాన్యం, గడ్డి వాములు దగ్ధమయ్యాయి. వెంట నే స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమాచా రం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, పరి స్థితిని పరిశీలించారు. ఈ ఘటనలో సుమారు రూ.60వేలు ఆస్తి నష్టం వాటి ల్లినట్టు రాజాం అగ్నిమాపక శాఖ ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. సకాలంలో తీసుకున్న చర్యల వల్ల సుమారు రూ.90వేలు మేర జరగాల్సిన అదనపు నష్టాన్ని నివారించగలిగినట్టు ఆయన వెల్లడించారు.

గరికపాడులో..

సంతకవిటి మండల పరిధిలోని గరికపాడు గ్రామంలో వావిలపల్లి రమణ అనే రైతుకు చెందిన పొలంలో చెరకు పంట అగ్నికి ఆహుతయ్యింది. ఈ ఘట నలో సుమారు ఒక ఎకరా చెరకు పంట దగ్ధమైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకురావడంతో నష్టం చాలా వరకు తగ్గింది.

Updated Date - Feb 08 , 2026 | 12:01 AM