Share News

గ్రోత్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:32 AM

బొబ్బిలిలోని గ్రోత్‌ సెంటర్‌లో గల సహారా-2 పరిశ్రమలో శుక్రవారం మధ్యా హ్నం అగ్ని ప్రమాదం జరిగింది.

గ్రోత్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం
పరిశ్రమ నుంచి వెలువడుతున్న పొగ

రూ.5 కోట్ల మేర ఆస్తినష్టం?

బొబ్బిలి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలిలోని గ్రోత్‌ సెంటర్‌లో గల సహారా-2 పరిశ్రమలో శుక్రవారం మధ్యా హ్నం అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలడంతో భారీగా మంటలు వ్యాప్తి చెందాయి. దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో పరిశ్రమలోని కార్మికులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదాన్ని గమనించిన కార్మికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిం చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ప్రమాదానికి సంబంధించి పూర్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Updated Date - Nov 14 , 2026 | 12:32 AM