నిత్యసాయి పరిశ్రమలో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:25 AM
కోనాడ పంచాయతీ పరిధిలోని నిత్యసాయి పరిశ్రమలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది.
పూసపాటిరేగ, జనవరి 17(ఆంధ్రజ్యోతి): కోనాడ పంచాయతీ పరిధిలోని నిత్యసాయి పరిశ్రమలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. పండుగ సమయం కావటంతో పరిశ్రమలో పెద్దగా కార్మికులు లేకపోవటంతో ప్రాణనష్టం జరగలేదు. ప్రాథమిక అంచనా ప్రకారం ఆస్తినష్టం రూ.10లక్షలు ఉంటుందని యాజమాన్యం చెబుతోంది. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పరిశ్రమలో డిస్టిలరీ బ్లాక్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి సిబ్బంది వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా విజయనగరం సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. కొప్పెర్లలోని బయోటెక్ పరిశ్రమవారు, పైడిభీమవరంలోనిగల అరబిందో పరిశ్రమవారు కూడా సహకరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పండగ సందర్భగా రెండురోజులుగా డిస్టిలరీ బ్లాక్‌ను నిలుపుదలచేసి శనివారం ప్రారంబించారు. స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగక పోవటంతో ఊపిరిపీల్చుకొన్నారు.