చెక్కను కోస్తుండగా తెగిన చేతి వేళ్లు
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:18 AM
వృత్తి పని చేస్తుండగా ఓ వడ్రింగి తన ఎడమ చేతి వేళ్లను కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రేగిడి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): వృత్తి పని చేస్తుండగా ఓ వడ్రింగి తన ఎడమ చేతి వేళ్లను కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. రేగిడి మండలం సంకిలికి చెందిన అరసాడ ప్రకాశ్ తన తండ్రి లక్ష్మణ రావుతో ఈనెల 31న సంతకవిటి మండ లం మాదవరాయపురం వడ్రంగి పనికి వెళ్లారు. అక్కడ చెక్కపని చేస్తుండగా, రంపంతో కోసే క్రమంలో ప్రకాశ్‌కు ప్రమాదవశాత్తు ఏడమ చేతి చూపుడు వేని మినహా నాలుగు వేళ్లు తెగిపోయాయి. ప్రస్తుతం బాధితుడు రాజాం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈయనకు తల్లిదండ్రులతో పాటు భర్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ యువకుడికి పింఛన్ వచ్చేలా అధికా రులు చూడాలని పలువురు కోరుతున్నారు.