ప్రతి ఇంటికీ సన్న బియ్యం
ABN , Publish Date - Aug 11 , 2026 | 12:03 AM
ప్రతి కుటుంబా నికి నాణ్యమైన సన్న బియ్యాన్ని అందించడమే ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు.
గ్రామాల్లో విక్రయ కేంద్రాల ప్రారంభం
డెంకాడ, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ప్రతి కుటుంబా నికి నాణ్యమైన సన్న బియ్యాన్ని అందించడమే ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. డెంకాడలో ఏర్పాటుచేసిన సన్న బియ్యం విక్రయ కేంద్రాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు. మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు, పాణిరాజు తదితరులు పాల్గొన్నారు.
భోగాపురం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): సవరవల్లి గ్రామంలోని మిల్లులో ఏర్పాటుచేసిన సన్నబియ్యం విక్ర యకేంద్రాన్ని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి సోమవారం ప్రారంభించారు. స్థానిక నాయకులు పాలొ ్గన్నారు.
శృంగవరపుకోట, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటికీ నాణ్యమైన బియ్యాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలితకు మారి అన్నారు. స్థానిక రైతుబజారులో ఏర్పాటుచేసిన సన్నబియ్యం విక్రయ కేంద్రాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు.
మరో రెండేళ్లలో పోలవరం నీరు చంపావతికి అనుసంధానం..
పూసపాటిరేగ, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): మరో రెండేళ్లలో పోలవరం నీటిని చంపావతికి అనుసంధానం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. పేరాపురం వద్ద ఏర్పాటుచేసిన సన్న బియ్యం విక్రయ కేంద్రాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మంతెన రాధిక, సీఎస్‌డీటీ మురళి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు జలపార శివ, స్థానిక మాజీ సర్పంచ్ శ్రీరామమూర్తి, నాయకులు పతివాడ శ్రీనివాసరావు, జమరాజు, బొంతు రవికుమార్, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.