Share News

ఎస్‌బీఐ కంటోన్మెంట్‌ బ్రాంచ్‌కు జరిమానా

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:19 AM

బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వినియోగదారుడికి కలిగిన మానసిక క్షోభ, ఆర్థిక నష్టానికిగాను ఎస్‌బీఐ కంటోన్మెంట్‌ బ్రాంచ్‌కు జిల్లా వినియో గదారుల కమిషన్‌ జరిమానా విధించింది.

 ఎస్‌బీఐ కంటోన్మెంట్‌ బ్రాంచ్‌కు జరిమానా

విజయనగరం, రింగురోడ్డు, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వినియోగదారుడికి కలిగిన మానసిక క్షోభ, ఆర్థిక నష్టానికిగాను స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కంటోన్మెంట్‌ బ్రాంచ్‌కు జిల్లా వినియో గదారుల కమిషన్‌ జరిమానా విధించింది. బాధితుడికి రూ.3లక్షల పరిహారంతో పాటు రూ.20వేలు కోర్టు ఖర్చులు చెల్లించాలని కమిషన్‌ అధ్యక్షుడు ఆర్‌వీ నాగసుందర్‌ తీర్పు ఇచ్చారు. విజయనగరం ఉడా కాలనీకి చెందిన ఓ వినియోగదారుడు 2000 సంవత్సరంలో ఎస్‌బీఐ కంటోన్మెంట్‌ బ్రాంచ్‌లో కార్‌ లోన్‌ తీసుకున్నారు. ఈ సమయంలో సెక్యూరీటీ కింద తన ఖాళీ స్థలానికి సం బంధించిన ఆసలు పత్రాలను బ్యాంకులో ఉంచారు. 2013లో లోన్‌ మొత్తం తిరిగి చెల్లించిన అనంతరం తన పత్రాలను తిరిగి ఇవ్వాలని కోరగా బ్యాంకు సిబ్బంది కాలయాపన చేశారు. చివరకు ఆ పత్రాలు పోయాయని సమాధానం చెప్పారు. దీంతో బాధితుడు జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కేసును విచారించిన కమిషన్‌ అధ్యక్షుడు ఆర్‌వీ నాగసుందర్‌ బ్యాంకు సేవల్లో లోపాన్ని తీవ్రంగా పరిగణించారు. పోయిన పత్రాలకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని బాధితుడికి సర్టిఫైడ్‌ డూప్లికేట్‌ పత్రాలతో పాటు ఇండెమ్నిటీ బాండ్‌ను అందజేయలని బ్యాంకును ఆదేశించారు. వీటితో పాటు రూ.3.20లక్షల మొత్తాన్ని వినియోగదారుడికి 45 రోజుల్లో చెల్లించాలని తీర్పు వెలువరించారు.

Updated Date - Feb 06 , 2026 | 12:19 AM