‘Divyang Shakti’ ‘ దివ్యాంగ శక్తి’తో ఆర్థిక భరోసా
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:17 AM
Financial Security with ‘Divyang Shakti’ దివ్యాంగ శక్తి పథకంతో దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దివ్యాంగ శక్తి (దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం) పథకాన్ని ఆమె ప్రారంభించారు.
సాలూరు, మార్చి18(ఆంధ్రజ్యోతి): దివ్యాంగ శక్తి పథకంతో దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దివ్యాంగ శక్తి (దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం) పథకాన్ని ఆమె ప్రారంభించారు. తొలుత జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అనంతరం బస్సులో దివ్యాం గులకు ఉచిత ప్రయాణ టిక్కెట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దివ్యాంగులకు ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 21 రకాల దివ్యాంగుల్లో 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించొచ్చని వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 12.76 లక్షల మంది లబ్ధి పొందనున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఎన్నికల ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ బీఎం ఆచారి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.