Share News

Pensions పింఛన్లతో ఆర్థిక భరోసా

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:18 AM

Financial Security Through Pensions పాచిపెంట మండలం గిరిశిఖర గ్రామం గంగన్నదొరకోనవలస గ్రామంలో సోమవారం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, గ్రామస్థులతో ఆమె మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

  Pensions  పింఛన్లతో ఆర్థిక భరోసా
పింఛన్‌ సొమ్ము అందిస్తున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, జూన్‌1(ఆంధ్రజ్యోతి): పాచిపెంట మండలం గిరిశిఖర గ్రామం గంగన్నదొరకోనవలస గ్రామంలో సోమవారం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, గ్రామస్థులతో ఆమె మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ అవసరం వచ్చినా తన ఇంటి తలుపుతట్టాలని సూచించారు. ప్రభుత్వం పింఛన్లతో పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. అనంతరం వందకు పైగా గిరిజన కుటుంబాలు టీడీపీలో చేరాయి. అంతకుముందు మంత్రికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ‘ రోజూ పేపర్‌, టీవీలు, ఫ్లెక్సీల్లో మిమ్మల్ని చూస్తుంటాం. ఇప్పుడు నేరుగా తమ గ్రామానికి వచ్చి.. పింఛన్లు పంపిణీ చేయడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.’ అని గ్రామ గిరిజనులు మంత్రి ఎదుట తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు యుగంధర్‌, చైర్మన్‌ సూర్యనారాయణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తొలిరోజు 79 శాతం పంపిణీ

గరుగుబిల్లి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ జరిగింది. సచివాలయ సిబ్బంది సోమవారం ఉదయాన్నే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందించారు. అయితే పార్వతీపురం, సాలూరు, పాలకొండ అర్బన్‌ ప్రాంతాల్లో, భామిని, బలిజిపేట, వీరఘట్టాం, గరుగుబిల్లి, మక్కువ మండలాల్లో సర్వర్‌, సిగ్నల్‌ సమస్యలు వెంటాడాయి. దీంతో పింఛన్ల పంపిణీలో జాప్యం నెలకొంది. లబ్ధిదారులు చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. జిల్లాలోని 1.37 లక్షల పింఛన్లకు గాను ప్రభుత్వం రూ. 59.30 కోట్లు విడుదల చేసింది. సర్వర్‌ సమస్య కారణంగా తొలిరోజు 1,10,433 పింఛన్లనే పంపిణీ చేశారు. మొత్తంగా 79 శాతం మేర పంపిణీ జరిగింది.

Updated Date - Jun 02 , 2026 | 12:18 AM