పీ-4 విధానంలో ఆర్థిక సాయం
ABN , Publish Date - May 21 , 2026 | 12:01 AM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన పీ-4 విధానాన్ని స్పూర్తిగా తీసుకుని విజ్జీ స్టేడియంలో వాచ్‌మెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న గణపతి అనారోగ్యానికి గురికావడంతో ఆయన సతీమణి రాజేశ్వరీకి రూ.25 వేలు చెక్కును ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అందజేశారు.
విజయనగరం రూరల్, మే 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన పీ-4 విధానాన్ని స్పూర్తిగా తీసుకుని విజ్జీ స్టేడియంలో వాచ్‌మెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న గణపతి అనారోగ్యానికి గురికావడంతో ఆయన సతీమణి రాజేశ్వరీకి రూ.25 వేలు చెక్కును ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అందజేశారు. ఈ మేరకు బుధవారం విజ్జీ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్థికసాయం చేశారు. ఈ సాయంతో గణపతికి వైద్య పరీక్షలు చేయించాలని ఆమె సూచించారు.