Share News

Final touches to the airport ఎయిర్‌పోర్టుకు తుది మెరుగులు

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:01 AM

Final touches to the airport భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రధానమైన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) టవర్‌ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Final touches to the airport ఎయిర్‌పోర్టుకు తుది మెరుగులు
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధమవుతున్న ఏటీసీ టవర్‌

ఎయిర్‌పోర్టుకు తుది మెరుగులు

వచ్చేనెలలో ప్రారంభానికి వాయువేగంతో సన్నాహాలు

అధునాతన పరిజ్ఞానంతో సిద్ధమవుతున్న ఏటీసీ టవర్‌

భోగాపురం, జూన్‌25 (ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రధానమైన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) టవర్‌ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ వైపుగా వాయువేగంతో సన్నాహాలు జరుగుతున్నాయి. మిగిలి ఉన్న పనులను త్వరగా పూర్తి చేసే లక్ష్యంతో అందరూ ఉన్నారు. విమానాశ్రయంలో ప్రధానమైన ఏసీటీ టవర్‌ భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. రన్‌వే, ట్యాక్సీవే, యాప్రాన్‌ ప్రాంతాలు, అప్రోచ్‌ రహదారులతో సహా కీలకమైన ఎయిర్‌సైడ్‌ మౌలిక సదుపాయాలన్నీ కనిపించేలా నిర్మాణం చేపట్టారు. దీనిని సముద్ర మట్టం నుంచి 106.65 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తున్నారు. ఎయిర్‌ ట్రాఫిక్‌ పర్యవేక్షణ, నిర్వహణతో పాటు విమానాశ్రయం సెకండరీ సర్వైలైన్స్‌ రాడార్‌(ఎస్‌ఎస్‌ఆర్‌)తో పాటు ఏడీఎస్‌బి(ఆటోమిటిక్‌ డిపెండెంట్‌ సర్వైలెన్స్‌ బ్రాడ్‌కాస్ట్‌), సర్వైలెన్స్‌ ఫీడ్‌లతో ఏసీటీ సొంత నిఘా వ్యవస్థతో పనిచేస్తుంది. విమానాశ్రయం ప్రస్తుతం క్యాట్‌1 ల్యాండింగ్‌ సామర్థ్యంతో నిర్మితమవుతోంది. అవసరాలను బట్టి భవిషత్తులో క్యాట్‌2, క్యాట్‌3కి అప్‌గ్రేడ్‌ చేయడానికి వీలుగా సిద్ధమవుతుంది. అలాగే భారత నౌకాదళం నిర్వహిస్తున్న విశాఖపట్నం విమానాశ్రయానికి భిన్నంగా భోగాపురం విమానాశ్రయం కేవలం పౌర సేవలనే అందించనుంది.

Updated Date - Jun 26 , 2026 | 12:01 AM