Share News

మహిళా ఓటర్ల తుది జాబితా విడుదల

ABN , Publish Date - Sep 22 , 2026 | 12:17 AM

స్థానిక మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన 36 వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా ఓటర్ల తుది జాబితాను మున్సిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి సోమవారం విడుదల చేశారు.

మహిళా ఓటర్ల తుది జాబితా విడుదల
తుదిజాబితాను విడుదల చేస్తున్న కమిషనర్‌ రామలక్ష్మి

బొబ్బిలి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): స్థానిక మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన 36 వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా ఓటర్ల తుది జాబితాను మున్సిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి సోమవారం విడుదల చేశారు. పట్టణంలో మొత్తం 49,284 మంది ఓటర్లు ఉండగా ఎస్టీ ఓటర్లు 735, ఎస్సీ 4747, బీసీలు 35885 ఉన్నట్టు లెక్కతేల్చారు. మిగిలిన కేటగిరీలకు చెందిన మహిళా ఓటర్లు 25,411 మంది ఉన్నారు. దీంతో పట్టణంలో మహిళా ఓటర్లదే పైచేయిగా నిలిచింది. ఇటీవల ముసాయిదా జాబితాను ప్రకటించిన తర్వాత ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, క్లెయిమ్‌లను పరిశీలించి పరిష్కరిస్తామని కమిషనర్‌ తెలిపారు.

వార్డుల రిజర్వేషన్‌ ప్రకటనే తరువాయి...

మున్సిపాలిటీ పరిధిలో గల 36 వార్డులలో కులాల వారీగా ఓటర్ల మార్కింగ్‌ ప్రక్రియ అధికారికంగా పూర్తి కావడంతో ఇక ఆయా వార్డులను ఏయే కేటగిరీ అభ్యర్థులకు కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. వార్డులలో పోటీ చేయాలనుకునే ఆశావహులు తమ వార్డు ఏ కేటగిరీకి రిజర్ట్‌ అయిందనే విషయాన్ని తెలుసుకునే యత్నాల్లో ఉన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 12:18 AM