Share News

హక్కుల కోసం పోరాటమే శరణ్యం

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:25 AM

విజయనగరంలోని ఎన్జీవో హోంలో ఆదివారం ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపీడీఆర్‌) ఆధ్వర్యం లో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు.

హక్కుల కోసం పోరాటమే శరణ్యం

  • ఓపీడీఆర్‌ రాష్ట్ర అధ్యక్షుడు జతిన్‌

విజయనగరం రూరల్‌, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): విజయనగరంలోని ఎన్జీవో హోంలో ఆదివారం ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపీడీఆర్‌) ఆధ్వర్యం లో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. ఈసందర్భంగా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్ష ణ సంస్థ అధ్యక్షుడు డా.జతిన్‌ మాట్లాడుతూ, ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాటమే శరణ్యమన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు. సంస్థ నివేదికను కె.సుబ్బారెడ్డి చదివి వినిపిం చారు. ఆ సంస్థ జిల్లా ప్రతినిధులు ఎ.సదాశివరావు, నాయుడు, నరసింహారెడ్డి లు మాట్లాడుతూ, గిరిజన గ్రామీణ పట్టణ పేద ప్రజల సమస్యలు పరిష్కరించాల న్నారు. భూ స్వామ్య దందాలను అరికట్టాలన్నారు. పేదవాడికి విద్య, వైద్యం అందించాలన్నారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నేతలు కె.వెంకటేశ్వరరావు, సీహెచ్‌వీఎస్‌ఎన్‌ మూర్తి, జి.సత్యనారాయణ, డి.ఈశ్వరరావు, ఎస్‌.చిరంజీవి, జీఎస్‌ రాజు, కె.రాంబాబు, ధనుంజయ్‌కుమార్‌, శరత్‌కుమార్‌, ఎస్‌వీ పైడిరాజు, కె.సత్యం, సీహెచ్‌ పైడిపల్లి వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 12:25 AM