గోడ సమస్యపై కొట్లాట
ABN , Publish Date - May 13 , 2026 | 12:20 AM
బడ్డుమాసంగి గ్రామంలో మంగళవారం ఇరు కుటుంబాల మధ్య జరిగిన కొట్లాటలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
పాలకొండ, మే 12 (ఆంధ్రజ్యోతి): బడ్డుమాసంగి గ్రామంలో మంగళవారం ఇరు కుటుంబాల మధ్య జరిగిన కొట్లాటలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన చింతాడ చంద్రయ్య ఇల్లు నిర్మాణం చేపడు తున్నారు. ఈ క్రమంలో ఆ ఇంటి పక్కనే ఉన్న పసుపురెడ్డి కృష్ణారావు ఇంటి గోడకు మేకులపై కొడుతుండటంతో అభ్యంతరం తెలిపారు. రెండు ఇళ్లకు మధ్య ఉన్న గోడ సమస్య తీరకుండానే పనులు చేయడం ఏమిటని కృష్ణారావు ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య జరిగిన వాగ్వాదం కొట్లాటకు దారితీసింది. చింతాడ చంద్రయ్యపై పసుపురెడ్డి కృష్ణారావు, ఆయన కుమారుడు అభిషేక్ దాడిచేసి గాయపరిచారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం చంద్రయ్య పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా తమపై కూడా చింతాడ చంద్రయ్య తమపై దాడి చేశాడని పసుపురెడ్డి కృష్ణారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వెంకన్న తెలిపారు.